హుజార్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామ కట్టమీద శివాలయం సమీపంలో 30 నుంచి 40 అడుగుల మేర చెర్వు కట్ట తెగిపోయింది. బూరుగడ్డ రోడ్డు సిమెంట్ కాల్వ కొట్టుకు పోయింది. బూరుగడ్డ, మాచవరం, కరక్కయలగూడెం గ్రామాలకు గోపాలపురంతో రాకపోకలు నిలిచిపోయాయి. పైర్లు కొట్టుకపోయి పొలాలు సముద్రం ఒడ్డున ఉండే ఇసుక దిమ్మెలను తలపిస్తున్నాయి. రాకపోకల పునరుద్ధరణ చాలా సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు.