హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన నామవరపు అనిల్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గ పనిచేస్తున్నాడు. శుక్రవారం అయ్యప్ప స్వామి గుడిలో విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా 11 కేవీ వైర్ల ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఘాతానికి గురై కింద పడ్డాడు.దీనితో అతనికి వెన్నపూసకు, మిగతా శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.