హుజూర్ నగర్: పేద మహిళలకు చీరలు పంపిణీ
క్రిస్మస్ పండుగ సందర్భంగా హుజూర్ నగర్ శ్రీనగర్ కాలనీలోని గుడ్ న్యూస్ చర్చిలో బుధవారం ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా చర్చి పాస్టర్ ఊటుకూరి రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, యవనస్తులు పాల్గొన్నారు.