Feb 17, 2025, 12:02 IST/
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. నష్టపరిహారంపై అప్డేట్
Feb 17, 2025, 12:02 IST
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం వారికి అందించినట్లు రైల్వే శాఖ తెలిపింది. మృతి చెందిన 18 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం.. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షల చొప్పున, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం అందజేసినట్లు స్పష్టం చేసింది. మొత్తం 33 మందికి పరిహారం అందజేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.