సోషల్ మీడియా నిర్ధాక్షిణ్యంగా, ప్రమాదకరంగా మారిందని ఎన్ ఎస్ యు ఐ మునగాల మండలం అధ్యక్షులు గోగుల లక్ష్మణ్ అన్నారు. కొన్ని మానవమృగాలను నియంత్రించడం కష్టంగా మారినందున పిల్లల వీడియోలు, ఫొటోలు పోస్టు చేసేటప్పుడు విచక్షణతో ఆలోచించాలని తల్లిదండ్రులకు సూచించారు. తాజాగా కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపైనే ఆయన ఇలా స్పందించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.