కోదాడ: ప్రాణం తీసిన అతివేగం.. తల్లి కొడుకు మృతి

50చూసినవారు
కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొని తల్లి, కుమారుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. వేగంగా ఢీకొట్టడంతో ఒక కారు రోడ్డు పక్కన ఉన్న వంతెన గోడ పైకి ఎక్కింది. ప్రమాదానికి కారణం కారు నడుపుతున్న డ్రైవరు నిద్ర మత్తులో ఉండటమే కారణమని తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్