గత 15 సంవత్సరాలకు పైగా కోదాడలో పలు ప్రైవేటు విద్యా సంస్థలలో పని చేసి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పనులు లేక అనారోగ్యంతో బాధపడుతున్న జయమ్మ పరిస్థితిని భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యస్ యస్ రావు తెలుసుకున్నారు. మానవత్వంతో స్పందించి ఆదివారం కోదాడలోని శ్రీ లక్ష్మీ వాసు కిరాణా దుకాణంలో నిత్యావసరాలు, బియ్యం అందజేశారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.