స్వాముల దీక్షలు విజయవంతం కావాలని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది గాలి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఆదివారం కోదాడలోని గాలి రమేష్ నాయుడు అన్నదాన సన్నిధానంలో స్వాములకు దాత బిఎస్ఎన్ఎల్ చంద్రశేఖర్ సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానానికి సహకరిస్తున్న దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉన్నారు.