కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గళం నరేష్ చారి గురు వారం జ్యోతి రావ్ పూలే వర్థంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై పూలే చిత్రాన్ని ఆవిష్కరించి ఆయన పై తనకు ఉన్న దేశ భక్తి నిచాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువుల పై పలు అనేక కళారూపాలను ఆవిష్కరించి అవార్డులను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తాననిచారి పేర్కొన్నాడు.