కోదాడ మండల పరిధిలోని దోరకుంట శివారులో రెండు లారీలు ఢీ కొన్న ఘటన జరిగినది. మంగళవారం దోరకుంట శివారులో రైస్ లారీ మరమ్మత్తుల కారణంగా ఆగి ఉండటంతో అటుగ వస్తున్న మరో లారీ ఆగి ఉన్న లారీని ఢీ కొని రైస్ లారీ కిందకు వెళ్లి బోల్తా పడగా, ప్రమాదానికి కారణమైన లారీలో మంటలు చెలరేగి దగ్దమయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్స్ క్షేమంగా బయపపడ్డారు.