మఠంపల్లి మండలం ఘునాథపాలెంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. సతీష్ రెడ్డి 3 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పత్తి, మిరప పంటలను సాగుచేస్తున్నారు. పంటపోలంలో మందు పిచికారీ చేసేందుకు నీరు అవసరం కాగా పొలంలోఉన్న మోటార్ వద్దకు వెళ్ళాడు. సతీష్ రెడ్డి మోటార్ ఆన్ చేసే క్రమంలో తెగిపడి వున్న విద్యుత్ వైర్ కు సతీష్ రెడ్డి తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.