ఏపీలో నామినేటెడ్ పోస్టులు చిచ్చు రేపాయి. కూటమి ప్రభుత్వం తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. అయితే ఈ నామినేటెడ్ పోస్టులతో టీడీపీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు ఇద్దరు టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వారికి పదవులు ఇవ్వకపోవడంతో పాటు భవిష్యత్‌పై హైకమాండ్ భరోసా ఇవ్వకపోవడంతో నిరాశకు గురైనట్లు సమాచారం.