వ్యవసాయ కూలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు విజ్ఞప్తి చేశారు. కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రంగంలో యంత్రాల రాకతో కూలీలకు సంవత్సరంలో 70 రోజులకు మించి పని దొరకడం లేదని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కూలీలను చిన్నచూపు చూస్తున్నాయన్నారు.