Oct 06, 2024, 17:10 IST/తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి: ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Oct 06, 2024, 17:10 IST
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2000-01 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు నెమరు వేసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీతరాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.