మునగాల: కారు బీభత్సం.. మహిళ మృతి
మునగాల మండలం మాధవరం వద్ద మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. పాదచారులతో పాటు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. నలుగురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. పొలానికి పురుగుల మందు కొట్టడానికి రైతులు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.