నల్గొండ జిల్లాలో నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా 24 గంటల పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 950 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 70 మంది ఎస్ఐలు, 620 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఏఆర్ సిబ్బంది, 250 మంది ట్రెయినీ కానిస్టేబుళ్లు, ఇద్దరు ఏఎస్పీలు బందోబస్తులో పాల్గొంటున్నారు.