సూర్యాపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన చెందిన గోపయ్యచారితో పాటు పలువురు సైనికులకు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు చల్ల లక్ష్మయ్య మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక మన ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు.