కార్తీకమాసం పురస్కరించుకొని వైన్ షాపులు వేలవేల బోతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు వైన్ షాపులలో మిగతా రోజులతో పోల్చుకుంటే కార్తీకమాసంలో గణనీయంగా గిరాకీ తగ్గిందని నిర్వాహకులు తెలుపుతున్నారు. కార్తీక మాసం మొత్తం ఇలాగే ఉంటుందని తెలిపారు. వైన్ షాపుల నిర్వాహకులకే కాక ప్రభుత్వంపై కూడా భారం పడే అవకాశం ఉంది. మద్యం విక్రయాలు సగానికి పైగా పడిపోయాయని తెలిపారు.