తిరుమలగిరి మండలం - Thirumalagiri Mandal

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తిరుమలగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన 120 మంది లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి, షాధి ముబారక్ చెక్కులను తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ తన చేతుల మీదుగా అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రానికి రాబడి లేకున్న సంక్షేమ పథకాలు నడిపిస్తున్నా గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదని,పేదలకు ఎటువంటి నష్టం జరగకూడదని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని,కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చిన నిధుల కంటే మన రాష్ట్రం నుండి తీసుకున్న నిధులు ఎక్కువని,కేంద్రంకు రాష్ట్రలను కాపాడుకునే ఆలోచించే పరిస్థితిలు లేవని,రైతుల యొక్క భూ కష్టాలను తీర్చడానికి రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడ బిడ్డకు పెళ్లి రోజున నా వంతుగా నేను సహాయం చేయాలని ఆలోచించి కళ్యాణాలక్ష్మి పథకం చెప్పట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అన్నారు.మన గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ గారు పది కాలాల పాటు బాగుండాలని మనమందరం కోరుకోవాలని అన్నారు.అనంతరం కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందుకుంటున్న తల్లులకు,అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహాలత సురేందర్ రావు,మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజని రాజశేఖర్,జెడ్పిటిసి దూపటి అంజలీ రవీందర్,మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్ మరియు సర్పంచ్ లు ,ఎంపీటీసీలు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.