
నేడు స్కూళ్లకు సెలవు!
వసంత పంచమి సందర్భంగా నేడు తెలంగాణలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు సెలవు ఉండనుంది. ఈ హాలిడే ఆప్షనల్ అని, దీనిపై స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే ఇవ్వలేదు. స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు.