యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వారి మరణం కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని లోటని వారు దేశానికి పార్టీ కి చేసిన సేవలను కొనియాడారు. భారతదేశం కు రెండు సార్లు ప్రదానిగా, రిజర్వుబ్యాంక్ కు గవర్నర్ గా వారు చేసిన సేవలు వెల కట్ట లేనివని గుర్తు చేశారు.