సొంత పార్టీపై స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు

51చూసినవారు
సొంత పార్టీపై స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు
ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌ తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ‘‘ఆప్‌ సీనియర్‌ నేత ఒకరు నిన్న నాకు కాల్‌ చేశారు. స్వాతిపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెప్పారు. నా వ్యక్తిగత ఫొటోలను లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు సదరు నేత తెలిపారు’’ అని స్వాతి ఆరోపించారు.