భారత్‌లోనూ కొత్తగా కోవిడ్ కేసుల నమోదు

50చూసినవారు
భారత్‌లోనూ కొత్తగా కోవిడ్ కేసుల నమోదు
భారత్‌లోనూ కేపీ-1, కేపీ-2 వేరియంట్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేపీ-2 వేరియంట్ కేసులు 290, కేపీ-1 వేరియంట్ కేసులు 34 నమోదైనట్లు తెలిపింది. కేపీ-1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 23, కేపీ-2 కేసులు మాత్రం ఎక్కువగా మహారాష్ట్ర 148 నమోదైనట్లు పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఇవన్నీ జేఎన్1 సబ్‌వేరియంట్లేనని.. వైరస్‌లో మ్యుటేషన్లు సాధారణమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్