T20WC: నేడు USతో టీమిండియా పోరు

57చూసినవారు
T20WC: నేడు USతో టీమిండియా పోరు
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం అమెరికాతో భారత్ మ్యాచ్ ఆడనుంది. రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఇరు జట్లు విజయం సాధించి ఉత్సాహంగా ఉన్నాయి. చిన్న జట్టే అయినప్పటికీ అమెరికా సంచలన విజయాలు సాధిస్తోంది. అయితే పటిష్టమైన టీమిండియాను ఎదుర్కోవడం ఆ జట్టుకు సవాలుగా మారనుంది.