ఢిల్లీకి మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు: హర్యానా సీఎం

66చూసినవారు
ఢిల్లీకి మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు: హర్యానా సీఎం
దేశ రాజధాని న్యూఢిల్లీకి మంచినీటి సరఫరాను మెరుగుపరిచేందుకు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారు. న్యూడిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఈ విషయాన్ని వెల్లడించారు. వేసవి కారణంగా న్యూఢిల్లీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. నీటి కేటాయింపుల్లో భాగంగా న్యూఢిల్లీకి రావాల్సిన మంచి నీటిని సరఫరా చేయాలని హర్యానా సీఎంకు తాను స్వయంగా ఫోన్ చేసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్