నటి తాప్సీ పన్ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భర్త మథియాస్ బో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “మథియాస్ ఎవరనేది చాలామందికి తెలియకపోవడం బాధాకరం. వ్యాపారవేత్త, క్రికెటర్ కానందున అతని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నా భర్త” అని చెప్పారు.