నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ‘తండేల్’ ఈవెంట్ కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ఈరోజు ఈవెంట్‌కు పబ్లిక్‌కు ఎంట్రీ లేదని తెలిపింది. ప్రసార మాధ్యమాల వేదికగా దీనిని వీక్షించి అభిమానులు ఎంజాయ్ చేయాలని కోరింది.