దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ
టాటా మోటార్స్ వాహన ధరలను మరోసారి పెంచింది. విద్యుత్ వాహనాలు సహా అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇన్ పుట్ కాస్ట్ పెరగినందుకే కార్ల ధరలు పెంచుతున్నామని, జులై 17 నుంచి ఈ పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, జులై 16 వరకు చేసే బుకింగ్‌లకు, జులై 31లోపు జరిగే డెలివరీలకు ధరల పెంపు వర్తించదని కంపెనీ పేర్కొంది.