సిట్ అధికారులు ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ నుంచి కీలక వివరాలు సేకరించారు. ‘ఎల్-1గా వచ్చిన సంస్థకు పూర్తిస్థాయిలో నెయ్యిని కట్టబెట్టే ముందు, ఎల్-2 కూడా అదే ధరపై సరఫరాకు ముందుకొస్తే, 65:35 ప్రాతిపదికన కట్టబెట్టే పద్ధతి ఉందా? ఒకవేళ ఉంటే, కిలో నెయ్యి రూ.319.80కి ఇచ్చేందుకు మరే సంస్థనైనా ముందుకొచ్చిందా? టెండర్లు పిలిచినప్పుడు మార్కెట్‌లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ధర ఎంతుందో పోల్చి చూశారా? టెండర్లలో ఏఆర్ డెయిరీ సంస్థ తొలుత ఎంతకు కోట్ చేసింది? రివర్స్ టెండరింగ్ తర్వాత ఎంత తగ్గించింది?’ తదితర ప్రశ్నలు వేసినట్లు తెలిసింది.