టీసీఎస్‌కు రూ.1,600 కోట్లు జరిమానా

53చూసినవారు
టీసీఎస్‌కు రూ.1,600 కోట్లు జరిమానా
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)కు అమెరికా కోర్టు పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది. వాణిజ్య రహస్యాలను బయటపెట్టిందన్న కేసులో కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (CSC) (ప్రస్తుతం DXC టెక్నాలజీ కంపెనీ) టీసీఎస్‌పై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్‌ కోర్ట్‌ టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. మొత్తం 194.2 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.1,600 కోట్లు) చెల్లించాలని పేర్కొంది. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్