వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతున్న వేళ కార్మికులపై మరో పిడుగు పడింది. ఒకేసారి 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్లు సమాచారం. వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు.