విద్యార్థిని కిందపడేసి ఘోరంగా కొట్టిన టీచర్ (వీడియో)

68చూసినవారు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గొల్లగూడెం మానస వికాస పాఠశాలలో విద్యార్థిని క్లాస్ టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. విద్యార్థిని కింద పడేసి పిడిగుద్దులతో చిత్రహింసలకు గురిచేశాడు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేసి సీసీటీవీ వీడియో చూసి కన్నీరుమున్నీరయ్యారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు నిరసనకు దిగారు.

సంబంధిత పోస్ట్