'టీమిండియా హై హమ్ రెహమాన్' స్పెషల్ సాంగ్ వైరల్

83చూసినవారు
హోరాహోరీగా జరిగిన పోరులో సౌతాఫ్రికాపై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత టైటిల్ దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ అపురూపమైన సందర్భంగా ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మెన్ ఇన్ బ్లూకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. జట్టుకు అభినందనలు తెలుపుతూ 'టీమిండియా హై హమ్' పేరుతో స్పెషల్ సాంగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్