కనిపించని దైవాన్ని పూజిస్తాము. కనిపించే దైవంగా డాక్టర్లను భావిస్తాము. నిత్యం రకరకాల అనారోగ్యాలు, యాక్సిడెంట్లతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రులకు వచ్చే వేలాది పేషెంట్ల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పని చేస్తారు. పగలు, రాత్రి ప్రజా సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశం ‘జాతీయ వైద్యుల దినోత్సవాన్ని’ జరుపుకుంటోంది.