వరదల్లో చిక్కుకున్న టీమ్ఇండియా స్పిన్నర్

53చూసినవారు
వరదల్లో చిక్కుకున్న టీమ్ఇండియా స్పిన్నర్
గుజరాత్‌లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదల్లో టీమిండియా మహిళా స్పిన్నర్ రాధాయాదవ్ కుటుంబం చిక్కుకున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు తమ కుటుంబాన్ని కాపాడినట్లు ఆమే స్వయంగా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను బోట్ల సాయంతో రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలకు రాధ ధన్యవాదాలు తెలిపారు. కాగా, గుజరాత్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్