ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదగడానికి కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. మెట్రో, RRR విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. 'కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పూర్తవుతుంది. HYD మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరముంది. ఒకప్పుడు 2వ స్థానంలో ఉన్న HYD మెట్రో.. నేడు 9వ స్థానానికి పడిపోయింది. మనం పోటీ పడాల్సింది ఏపీలోని అమరావతితో కాదు.. ప్రపంచస్థాయి నగరాలతో' అని వ్యాఖ్యానించారు.