అస్సాం సీఎస్‌గా తెలుగు ఐఏఎస్‌ అధికారి

75చూసినవారు
అస్సాం సీఎస్‌గా తెలుగు ఐఏఎస్‌ అధికారి
అస్సాం రాష్ట్ర 51వ సీఎస్‌గా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన 1993వ బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్ రవి కోత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన పబన్‌కుమార్‌ బోర్తకుర్‌ ఉద్యోగ విరమణ పొందటంతో రవి ఆ బాధ్యతలు చేపట్టారు. రవి సీఎస్‌ బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు.

సంబంధిత పోస్ట్