ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన క్యాబ్‌ డ్రైవర్‌

109344చూసినవారు
ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన క్యాబ్‌ డ్రైవర్‌
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. గిరీష్‌ (35) బెంగళూరులోని జయనగర్‌లో నివసిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫరీదా ఖాతున్‌ (42), బెంగళూరులోని స్పా సెంటర్‌లో పని చేస్తున్నది. వీరిద్దరికి పదేళ్ల నుంచి పరిచయం ఉంది. అయితే మార్చి 29న ఇద్దరు కలిసి హోటల్‌కు వెళ్లారు. అక్కడ పెళ్లి చేసుకుందామని గిరీష్ ప్రతిపాదించడంతో ఫరీదా తిరస్కరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన క్యాబ్ డ్రైవర్ గిరీష్.. ప్రియురాలు ఫరీదాను కత్తితో పొడిచి చంపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్