బంగ్లాలో ఆదివారం రాత్రి మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద వేలాది మంది విద్యార్థులు, అన్సార్ సభ్యులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైనికులు, పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేదు. అన్సార్ సభ్యుల్లో కొందరు బయటకు వెళ్లిపోగా.. మరికొందరు చిక్కుకుపోయారు. కొత్త ప్రభుత్వం తమపై కుట్ర చేస్తోందన్న విద్యార్థులు సెక్రటేరియట్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు.