హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడంతో నిరసనగా బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోని లాఠీఛార్జ్ చేయడంతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.