జమ్మలమడుగులో ఉద్రిక్తత

551చూసినవారు
జమ్మలమడుగులో ఉద్రిక్తత
కడప జిల్లా జమ్మల మడుగులో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిడిజివ్వి గ్రామం నుంచి 30 వాహనాలలో తన శ్రేణులతో కలిసి జమ్మలమడుగు వైపు రావడానికి ప్రయత్నం చేశారు. ముద్దనూరులో వైసీపీ నేత ముని రాజారెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఆదినారాయణ రెడ్డి కూడా తన శ్రేణులతో ముద్దనూరుకు పోవడానికి సిద్ధం కావడంతో ఆయనను, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసేరు. జమ్మలమడుగు, ముద్దనూరు మార్గం మధ్యలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.