హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్

57చూసినవారు
హైదరాబాద్ లో ఇవాళ గంటన్నర పాటుగా కురిసిన భారీ వర్షం.. నగరాన్ని స్తంభింపజేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతం జలమయం అవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని గచ్చిబౌలి, కూకట్ పల్లి నిజాంపేట, మూసాపేట, అబిడ్స్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, అమీర్ పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పలు చోట్ల రెండున్నర గంటల పాటుగా ప్రయాణికులు ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నారు. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది.

సంబంధిత పోస్ట్