జమ్మూలో ఉగ్రదాడి.. రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ

50చూసినవారు
జమ్మూలో ఉగ్రదాడి.. రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ
జమ్మూ కశ్మీర్‌లో యాత్రికులతో తిరిగొస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై దర్యాప్తును ఎన్ఐఏ‌కు అప్పగించినట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. భారత ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, పోలీసులు దాడి జరిగిన ప్రాంతంలో డ్రోన్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కూడా రంగంలోకి దిగింది.

సంబంధిత పోస్ట్