భారత్‌లో అటవీ భూముల వృద్ధి

54చూసినవారు
భారత్‌లో అటవీ భూముల వృద్ధి
ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు బాగా అభివృద్ధి చెందిన 10 దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 2010 నుంచి 2020 మధ్య దశాబ్దకాలంలో భారత్‌లో ఏటా 2,66,000 హెక్టార్ల అటవీ భూములు పెరుగుతూ వచ్చాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 19,37,000 హెక్టార్ల వృద్ధితో చైనా అగ్రస్థానంలో ఉండగా, 4,46,000 హెక్టార్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్