ప్రపంచంలో వింత పన్నులపై ప్రజల దృష్టి పడింది. అలాంటి పన్నుల్లో ఒకటి టాయిలెట్లను ఫ్లష్ చేయడంపై పన్నులు చెల్లించడం. అవును, నిజమే.. చాలా కాలం క్రితం అమెరికాలోని మేరీల్యాండ్‌లో టాయిలెట్లను ఫ్లష్ చేయడంపై కూడా పన్ను విధించారు. నీటి వినియోగాన్ని నియంత్రించడానికి ఈ పన్నును అమలు చేశారు. ఇక్కడ, ప్రతి నెలా 5 డాలర్లు అంటే సుమారు రూ.418 ప్రజల నుండి టాయిలెట్ ఫ్లషింగ్ పన్నుగా వసూలు చేస్తారు. ఆ డబ్బులను మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగిస్తారు.