బ‌స్సుపై ఉగ్ర‌దాడి.. 50 మంది అనుమానితులు అరెస్టు

83చూసినవారు
బ‌స్సుపై ఉగ్ర‌దాడి.. 50 మంది అనుమానితులు అరెస్టు
జ‌మ్మూక‌శ్మీర్‌లోని రియాసిలో ఓ బ‌స్సుపై ఉగ్ర‌వాదులు దాడి చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఆ ఘ‌ట‌న‌తో లింకు ఉన్న‌ట్లు అనుమానిస్తున్న 50 మందిని అరెస్టు చేశారు. రియాసి జిల్లాలో ఓ బ‌స్సుపై కాల్పులు జ‌ర‌ప‌గా, ఆ కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. 41 మంది గాయ‌ప‌డ్డారు. కాల్పులకు పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల‌ను ప‌ట్టుకునేందుకు భారీ స్థాయిలో సెర్చ్ ఆప‌రేష‌న్ జ‌రుగుతోంది.