అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు: భట్టి

74చూసినవారు
అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు: భట్టి
కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ దేశంలో స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశంలో, రాష్ట్రంలో తమ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.