దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

79చూసినవారు
దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవదాయశాఖ కమిషనర్ సహా ఆలయ వ్యవహారాల్లో ఏ అధికారి కూడా జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని వెల్లడించింది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే.. పీఠాధిపతుల సలహాలు తీసుకోవచ్చని తెలిపింది.

సంబంధిత పోస్ట్