AP: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన సొంత తండ్రే కాలయముడిగా మారాడు. అత్యంత క్రూరంగా పిల్లల జీవితాలను అంతమొందించాడు. పిల్లల కాళ్లూచేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి హతమార్చాడు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడలోని సుబ్బారావునగర్‌లో ఈ దారుణం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించట్లేదని వారిని చంపేసినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.