ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులు రోడ్డుపై పామును గుర్తించి తప్పించుకునేందుకు ప్రయత్నించి బైక్‌తో సహా ఏలేరు కాల్వలో పడిపోయారు. ఈ ప్రమాద ఘటనలో మహిళ (పాపరత్నం) కాలువలో మునిగి మృతి చెందగా, భర్త (నాగేశ్వరరావు) స్వల్ప గాయాలతో బయటపడి కాలువలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనతో నాగేశ్వరావు కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.